Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమానంలో మలయాళ నటికి వేధింపులు

Malayalam actress Divya Prabha alleges harassment on flight files complaint
Advertisement
  • కొచ్చికి వెళుతున్న విమానంలో ఘటన
  • మద్యం సేవించిన వ్యక్తి అసభ్యకరంగా వ్యవహరించినట్టు ఆరోపణలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి
Advertisement
ప్రముఖ మలయాళ వర్ధమాన నటి దివ్య ప్రభకు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ఆమె లైంగిక వేధింపులకు గురైంది. దీనిపై ఆమె కేరళ పోలీసులకు ఫిర్యాదు సైతం చేసింది. ఈ నెల 9న ముంబై నుంచి కొచ్చి వెళ్లేందుకు ఎయిర్ ఇండియా ఫ్లయిట్ ఏఐ 681లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

‘‘ఆల్కహాల్ సేవించిన ఓ వ్యక్తి 12సీ సీటులో కూర్చున్నాడు. తర్వాత తన సీటును 12బీకి మార్చుకుని, నా పక్క సీటు (12ఏ)లోకి చేరాడు. విండో సీటు కోసం నాతో అసంబద్ధంగా వాదనకు దిగాడు. నన్ను భౌతికంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. నేను ఈ విషయాన్ని వెంటనే ఎయిర్ హోస్టెస్ కు తెలిపాను. మూడు నుంచి నాలుగు వరుసల ముందు మధ్య సీటులోకి నన్ను మార్చారు తప్పించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

దురదృష్టవశాత్తూ నాతో అనుచితంగా వ్యవహరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోలేదు. కొచ్చి చేరుకున్న తర్వాత ఈ విషయాన్ని విమానాశ్రయ సిబ్బందికి, ఎయిర్ ఇండియా ఆఫీస్ సిబ్బందికి చెప్పాను. దాంతో పోలీసుల సాయం పొందాలని వారు నాకు సూచించారు. దీంతో నేను అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నాను’’ అంటూ మెయిల్ ద్వారా ప్రభ ఫిర్యాదు చేసింది.
Advertisement
Advertisement
Malayalam
actress
Divya Prabha
files complaint
harassment
Air India flight

More Telugu News